Текст песни
ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ కోటి వందనాలు హృదయేశ కోటి ప్రభాకర సంకాశ కోటి వందనాలు హృదయేశ కోటి ప్రభాకర సంకాశ ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ నిరాకారమే ఆది రూపమై నిత్య వికాసం పొంది భువి నీ తనువుగ మారింది నవ సందేశం ఇచ్చింది నవరససుధ చిందింది ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ బాబాయని నిను భక్తులందరూ ప్రణమిలి ప్రార్థించేరు పలు వరముల అర్థించేరు నీ సన్నిధిలో నిలిచి తీరుగా నీకు పూజలర్పించేరు ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ పగలు రాత్రి వెలిగేది ప్రళయం తెంబట మిగిలేది పరమార్థంబును తెలిసేది స్వరమాధుర్యము కురిసేది శిర్దీసాయి అన్న పేరది శ్రీకరమైనది దివ్యనిధి ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ అభయమునిచ్చే కరములు ఆశ్రయమొసగే పదములు కాంతి నిండినది వదనము శాంతికి నీ మది సదనము పవిత్రమగు నీ చరితము బహువిధ రసరుచి భరితము ఓ ఓ ఓ భవహర మన నీ మహిమము ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ అజ్ఞానమనే తిమిరంలో సుజ్ఞానమనే జ్యోతిబింబం తెరనల్లిన నీ రూపం చరాచరాత్మ ప్రతిబింబం స్వర్గవర్ణాత్మక హరిచాపం ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ నమ్మిన దాసుల బ్రోచెదవు ఓం నమ్మని మనసుల పూచెదవు ఓం రమ్మని దయకొని వేచెదవు ఓం నన్నిక వెలిగించెదవు క్షమా రాశివహో సదా పాహి ప్రభో ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ కోటి వందనాలు హృదయేశ కోటి ప్రభాకర సంకాశ కోటి వందనాలు హృదయేశ కోటి ప్రభాకర సంకాశ ఓం ఓం శిర్దేశ ఓంకార రూపా శిర్దేశ
Mano, Swarnalatha & A.R. Rahman — Om Om Siridisha
«Om Om Siridisha» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:54. Жанр — Этническая.
