Текст песни
ప్రభో శ్రీ గణనాథా! నీ మహిమ కీర్తించనా ప్రభో శ్రీ గణనాథా! నీ మహిమ కీర్తించనా నేనెంత నిన్ను పొగడ మదిలో భావం నీ చిరు కరుణేలే ప్రభో గణనాథా! నీ మహిమ కీర్తించనా జగమంత భాసించే ఓంకారమే నా మది నిండ నీవేలే దయానిధీ ఈ బ్రతుకు ఉన్నది నీ సేవకే నా యదపీఠం నీరాగ కోరిందిలే ఆనందం అందం నీవేనులే ఇల భేదం ఊదం నీ లీలలే మహాదివ్య రూపా నీవే నిఖిలం నీ శుభ చరితం వినినంత మహాయోగమే ప్రభో శ్రీ గణనాథా! నీ మహిమ కీర్తించనా ప్రాణితేజ తొలి పూజ నీకేనులే నీ శుభ రూపం అపురూపం మనోబలం ఈ భువన విజయాలు నీ వేడుకే నీ దయతోనే లోకాలు ఉన్నాయిలే నీ లీల దివ్యం మనోహరమే భూమండలం గాంచు నీ పాదమే వారాలిచ్చు దైవం నీవే వరదా నా యద వినతి ఆలించు మహా గణపతి ప్రభో శ్రీ గణనాథా! నీ మహిమ కీర్తించనా నేనెంత నిన్ను పొగడ మదిలో భావం నీ చిరు కరుణేలే ప్రభో శ్రీ గణనాథా! నీ మహిమ కీర్తించనా
Mano, Swarnalatha & A.R. Rahman — Prabho Sri Gananatha
«Prabho Sri Gananatha» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:00. Жанр — Этническая.
