Текст песни
ఓంకారి శ్రీంకారి శ్రీకాళి శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. ప్రణవ రూపమున వెలిగే ప్రముఖ ప్రబల శక్తి నీవు. ప్రముఖ ప్రబల శక్తి నీవు. అఖిల వేద శ్రీ మాతృక అక్షర గాయత్రి నీవు. అక్షర గాయత్రి నీవు. సకలాగమ సారమైన సాత్విక సావిత్రి నీవు. సాత్విక సావిత్రి నీవు. అణువున అణువై అలరే అద్వితీయ శక్తి నీవు. అద్వితీయ శక్తి నీవు. మహద్దుకే మహత్తైన మహా దివ్య శక్తి నీవు. మహా దివ్య శక్తి నీవు. అంత తంత్ర యంత్రములకు మాత నీవు మహిమ నీవు. మాత నీవు మహిమ నీవు. ఆది శక్తిగా వెలసి ఆత్మ శక్తి అయినావు శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. ప్రుధ్వికి అతి మూలమైన మూలాధారము నీవు. మూలాధారము నీవు. జల శక్తికి మూలమైన స్వాధిష్ఠానము నీవు. స్వాధిష్ఠానము నీవు. జనతేజో మూలమైన మణిపూరకమే నీవు. మణిపూరకమే నీవు. వాయుతత్వ మూలమైన భవ్య అనాహతము నీవు. భవ్య అనాహతము నీవు. ఆకాశ స్థానమైన అమల విశుద్ధము నీవు. అమల విశుద్ధము నీవు. అపర బుద్ధి స్థానమైన ఆజ్ఞా చక్రము నీవు. ఆజ్ఞా చక్రము నీవు. చర శక్తి మూలమైన సహస్రారమైనవు శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. సకల స్థూల శక్తి నీవు స్థూల శరీరము నీవు. స్థూల శరీరము నీవు. సర్వ సూక్ష్మ శక్తి నీవు సూక్ష్మ శరీరము నీవు. సూక్ష్మ శరీరము నీవు. కారణ కారణము నీవు కారణాంగమే నీవు. కారణాంగమే నీవు. అణుకడకే మూలమైన మహా కారణము నీవు. మహా కారణము నీవు. ప్రాణాపానము నీవు వ్యానోదానము నీవు. వ్యానోదానము నీవు. సమాన వాయువు నీవు పంచ ప్రాణములు నీవు. పంచ ప్రాణములు నీవు. ప్రాణ రూపమై వెలిగి ప్రాణ శక్తి అయినావు శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. పంచభూతములు నీవే పంచకోశములు నీవే. పంచకోశములు నీవే. అభివృద్ధికి స్థానమైన అన్నమయము నీవు దేవి. అన్నమయము నీవు దేవి. పంచ ప్రాణ స్థానమైన ప్రాణమయము నీవు మాత. ప్రాణమయము నీవు మాత. జ్ఞానేంద్రియ స్థానమైన మనోమయము నీవు తల్లి. మనోమయము నీవు తల్లి. జ్ఞానమునకు స్థానమైన విజ్ఞానమయము నీవు. విజ్ఞానమయము నీవు. అంతఃకర్ణాధారము ఆనందమయము నీవు. ఆనందమయము నీవు. పంచరూప మాతృకవై పరాశక్తివైనావు శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. కంచి కామాక్షి నీవు కాశీ విశాలాక్షి నీవు. కాశీ విశాలాక్షి నీవు. పధురా మీనాక్షి నీవు మాతా అన్నపూర్ణ నీవు. మాతా అన్నపూర్ణ నీవు. విజయవాడలో వెలసిన విజయ కనకదుర్గ నీవు. విజయ కనకదుర్గ నీవు. శ్రీచక్రములో చలగే చిద్రూపిణి నీవేలే. చిద్రూపిణి నీవేలే. కమల నీవు విమల నీవు కాళీ మాతవు నీవు. కాళీ మాతవు నీవు. రాజస గుణ విరాజితవు రాజరాజేశ్వరివి. రాజరాజేశ్వరివి. విభూతినే కండిల్చి విశ్వమాతవైనావు శ్రీ భవాని అపరాజిత నీవమ్మా. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము ఓంకారి శ్రీంకారి శ్రీకాళి శ్రీ భవాని అపరాజిత నీవమ్మా శ్రీ భవాని అండజేరి నుతించెము. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము. శ్రీ భవాని... అండజేరి నుతించెము. శ్రీ భవాని... నీ అండజేరి నుతించెము.
Muralidhar Srinivas — Omkari Srikari
«Omkari Srikari» — Muralidhar Srinivas. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:07. Жанр — Этническая.
