Текст песни
శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము వ్రత నియమము అతి సులభం అందించును శుభ ఫలితం యోగ క్షేమము నిచ్చే యాగము భవాని దీక్ష శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము అఖిల జగతికే మూలం ఆ భవాని ఆత్మ బలం శ్రీ భవాని నమో శ్రీ భవాని శ్రీ దీక్షే ఆరాధన సరివరముల సంభావన శ్రీ భవాని నమో శ్రీ భవాని నోములన్నీ నోచేము క్షేమము అందేము శ్రీ భవాని నమో శ్రీ భవాని వ్రతములన్నీ చేసేము వెతలన్నీ బాసేము శ్రీ భవాని నమో శ్రీ భవాని అర్చనలే చేసేము ఆనందము పొందేము అర్చనలే చేసేము ఆనందము పొందేము దీక్షతతో రక్షించుము దాక్షాయణి దాక్షిణ్య ఆ శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము అన్నిటికీ మూలమైన ఆది పరాశక్తి దేవి శ్రీ భవాని నమో శ్రీ భవాని శ్రీ చక్రములో వెలిగే శ్రీంకార శక్తి ఆమె శ్రీ భవాని నమో శ్రీ భవాని కామకోటి పీఠస్థిత కామాక్షి దేవి తల్లి కామకోటి పీఠస్థిత కామాక్షి దేవి తల్లి దీక్ష పూని అంకిడతో దివ్య భోగమందించు ఆ శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము తామస గుణ సంకాసిని దనుజ దమర భద్ర కాళి శ్రీ భవాని నమో శ్రీ భవాని రాజస గుణ విరాజితా రమ్య రాజ రాజేశ్వరి శ్రీ భవాని నమో శ్రీ భవాని సాత్విక గుణ సుప్రసన్న సహస్రార మహా శక్తి సాత్విక గుణ సుప్రసన్న సహస్రార మహా శక్తి దీక్షా దక్షతకు మెచ్చి దివ్యత్వము కరుణించుము ఆ శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము ఉపవాసములాచరించి ఉద్వేగమునే హరించి శ్రీ భవాని నమో శ్రీ భవాని భేద భావములు వీడి బ్రహ్మచర్యము పూని శ్రీ భవాని నమో శ్రీ భవాని ఎర్రని వస్త్రాలు కట్టి ఎర్రని తిలకము పెట్టి శ్రీ భవాని నమో శ్రీ భవాని ఖడ్గమాలిక స్తోత్రం క్రమము మీద పఠించి ఖడ్గమాలిక స్తోత్రం క్రమము మీద పఠించి దీక్షా మాలను ధరించి దివ్య వ్రతము చేయుమురా ఆ శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము హృదయమునే శ్రీ భవాని సదనముగా సంతరించి శ్రీ భవాని నమో శ్రీ భవాని మదిలో శ్రీ కనకదుర్గ మహిమలే భావించి శ్రీ భవాని నమో శ్రీ భవాని పూర్ణిమా ముహూర్తమున పూర్ణాహుతి అర్పించి శ్రీ భవాని నమో శ్రీ భవాని చండీ యాగము చేసి శక్తిని ఆరాధించి శ్రీ భవాని నమో శ్రీ భవాని చండీ యాగము చేసి శక్తిని ఆరాధించి చండీ యాగము చేసి శక్తిని ఆరాధించి ఇహములోన పరములోన సుఖములనే సాధించరా ఆ శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము వ్రత నియమము అతి సులభం అందించును శుభ ఫలితం యోగ క్షేమము నిచ్చే యాగము భవాని దీక్ష శ్రీ భవాని దివ్య దీక్ష పూనేము స్థిరముగ సిరి సంపదలే పొందేము స్థిరముగ సిరి సంపదలే పొందేము ఆ స్థిరముగ సిరి సంపదలే పొందేము
Mano, Swarnalatha & A.R. Rahman — Sri Bhavani Divya Diksha
«Sri Bhavani Divya Diksha» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:27. Жанр — Этническая.
